ఉత్తరాంధ్ర బిసి పొలిటికల్ జె.ఏ.సి కన్వీనర్ గా గొర్లె శ్రీనివాస నాయుడు
ఉత్తరాంధ్ర బిసి పొలిటికల్ జె.ఏ.సి కన్వీనర్ గా గొర్లె శ్రీనివాస నాయుడు
మేఘాలయ హోటల్ లో నరవ రాంబాబు మరియు ఎన్ని శ్రీనివాస రావు అధ్యక్షత న ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పొలిటికల్ జె.ఏ.సి కన్వీనర్ గా గొర్లె శ్రీనివాస నాయుడు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర రావు మరియు రాష్ట్ర యువజన అధ్యక్షులు శ్రీ కుమ్మరి క్రాంతి కుమార్ నియమించారు. గొర్లె శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో బిసి సంఘం బలోపేతం చేయడానికి ఉత్తరాంధ్ర బిసి సంఘం అధ్యక్షులు శ్రీ నరవ రాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు సహకారం తో మరియు ఉత్తరాంధ్ర జిల్లాల అద్యక్షులను సమనవ్యయం తో పనిచేసి బిసి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తానని అన్నారు రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు నాకు పదవీ ఇప్పిచటం కృషి చేసిన నరవ రాంబాబు , ఎన్ని శ్రీనివాసరావు క్రాంతి కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కామన వెంకట సుబ్బారావు, బిసి స్టడీ సర్కిల్ అధ్యక్షుడు శ్రీ వై వెంకటేశ్వరరావు , పల్లా రమణ యాదవ్, సిటీ అధ్యక్షులు పతకంశెట్టి శ్యామ్ సుధాకర్ , మహిళ అధ్యక్షరాలు దీప్తి సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.