ఈ – శ్రమ్ అసంఘటిత రంగ కార్మికుల నమోదు అవగాహన కార్యక్రమం లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ పద్మావతి
ఈ – శ్రమ్ అసంఘటిత రంగ కార్మికుల నమోదు అవగాహన కార్యక్రమం లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ పద్మావతి
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2 :వాంబేకాలనీ మధురవాడ సిరిపురపు శ్రీహరి సి ఎస్ సి &మీసేవ (CSC&MEESEVA ) సెంటర్ వద్ద ఈ – శ్రమ్ అసంఘటిత కార్మికుల నమోదు అవగాహన కార్యక్రమం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ పద్మావతి, జూనియర్ అసిస్టెంట్ యు రమేష్, చేపట్టారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ పద్మావతి ఈశ్రం కార్డు యొక్క ప్రయోజనాలు కార్మికులకు వివరాములను విపులంగా వివరించారు. గతంలో లేబర్ కార్డులను భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఇచ్చాము, ఈశ్రం కార్డు అన్ని రకాల కార్మికులు ధరకాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు,వలస కార్మికులు ఒక చోటి ఇంకో చోటికి వెళ్లి నప్పుడు ఈ – శ్రమ్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకొనే సదుపాయం ఉంటుంది ప్రధానమంత్రి పథకాలు ఇకపై నేరుగా ఈశ్రం నమోదు చేసుకున్న బ్యాంకు ఖాతాలలో జామచేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ పద్మావతి,జూనియర్ అసిస్టెంట్ యు రమేష్, సి ఎస్ సి &మీసేవ ఆపరేటర్ ఎస్. శ్రీహరి పాల్గొన్నారు.