Andhra PradeshVisakhapatnam

ఇదెక్కడి న్యాయం ❓️ప్రతిపక్షాల కార్యాలయాలపై దాడులా ❓️గంటా శ్రీనివాస్.

ఇదెక్కడి న్యాయం ❓️ప్రతిపక్షాల కార్యాలయాలపై దాడులా ❓️గంటా శ్రీనివాస్.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

*గంటా శ్రీనివాసరావు*ఎమ్మెల్యే, విశాఖ నార్త్ మాజీ మంత్రి

*ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా?*
*ఇదెక్కడి అన్యాయం* *ముఖ్యమంత్రి  ఒక్కసారి ఆలోచించండి* *ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే  రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? పట్టాభి మీడియా సమావేశం పై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు ఖచ్చితంగా ఇవి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను.రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, అలాంటిది మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి చెప్పాలి? ఆ మాత్రం కనీస విఘ్నత టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి తెలీదా?నిజంగా మీరు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజా స్మగ్లింగ్ నిర్ములనకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతల విమర్శలు ఖండించండి. రాజకీయ విమర్శలను ఎదుర్కోవడం నాయకుడి సహజ లక్షణం కావాలి, కానీ ఇలా ఫ్యాక్షనిజం ని గుర్తు చేసేలా సంఘటనలు చోటు చేసుకోవడం బాధగా ఉంది.ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: