Andhra PradeshVisakhapatnam

ఇండియా బుల్స్ భవనంలో పని చేస్తుండగా ప్రమాదావశాత్తు పెయింటర్ మృతి.. ❓

ఇండియా బుల్స్ భవనంలో పని చేస్తుండగా ప్రమాదావశాత్తు పెయింటర్ మృతి.. ❓

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

జోన్ 2 మధురవాడ ,పీఎం పా లెం పోలీస్ స్టేషన్ సినీ పోలీస్ థియేటర్ పక్కన ఉన్న ఇండియన్ బుల్స్ 15 అంతస్తుల భవనంలో కొంత మంది ఉదయం 8నుండి 9 గంటల మధ్యలో పెయింటింగ్ పని చేస్తుండగా అందులో  ఒక పెయింటర్ తాడు తెగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు అని తోటి కార్మికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి పీఎం పాలెం సి.ఐ.ఏ రవికుమార్, ఎస్ ఐ ఎం శ్రీనివాస్ రావు చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, జోన్ పూర్ జిల్లా, మచిలీ సిటీ, బనవాసి పూర్ గ్రామానికి చెందిన సోను బన వాణి 22 సంవత్సరాలుగా గుర్తించారు. సి ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!