ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిచ్చరపిడుగుకు ఘన సన్మానం.!

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన చిచ్చరపిడుగుకు ఘన సన్మానం.!
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
చిన్నారి జ్ఞానదేవ్ కు ఆర్.ఎస్.ఎ.వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడల్,జ్ఞాపికతో పాటు నగదు బహుమతి ప్రధానం.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో మధురవాడ కు చెందిన చిచ్చరపిడుగు. . ఆన్లైన్ ఎంపిక ద్వారా వియత్నం లో జరిగిన పోటీల్లో రికార్డు సాధించిన జ్ఞానదేవ్.
మధురవాడ: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ తల్లి నిరూపించింది.తన వల్ల కాలేని కళలను తమ పిల్లలతో సాకారం చేసుకుని మురిసి పోయింది ఆతల్లి.మధురవాడ శివశక్తినగర్ కు చెందిన అమితప్రియ తన కుమారుడు జ్ఞానదేవ్(2)కు14 నెలల నుండి 2సం వరకు తన శిక్షణ ద్వారా తర్ఫీదుఇచ్చి వియత్నందేశం లో జరిగిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. సుమారు అన్ని రాష్ట్రాల నుండి 150మంది ఆన్లైన్ ద్వారా 6రౌండ్లలో జరిగిన కార్యక్రమంలో జ్ఞానదేవ్ ఈ పోటీల్లో పాల్గొని జాతీయ చిహ్నాలు గుర్తింపు,ఆరు జాతీయ గుర్తులు,13సముద్ర జీవరాశులు, 21మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్,13రకాల పండ్లు,10 చారిత్రాత్మక స్థలాలు,10 స్టేషనరీ వస్తువులు,10కంప్యూటర్ విడిభాగాలు,ఐదు ప్రార్థనా స్థలాలు,పది రకాల క్రీడా బంతులు,8 ఇండియన్ సి.ఇ.లు,6మతాలు, ఎనిమిది రకాల నీటిమొక్కమూలాలు,9 మంచి అలవాట్లు గుర్తించాడు, మరియు 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.దీనిపై జ్ఞానదేవ్ కు పలువురు అభినందనలు తెలియాజేశారు.మధురవాడ పరిసర ప్రాంతా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు