ఆ ప్రాంతంలో నడక నరకప్రాయమే…

క్యాపిటల్ వాయిస్, నరసరావుపేట :-సాదారణ వర్షం పడితేనే అక్కడ నీరు నిల్వ వుండి స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి అవుతారు.అదే కనుక ఒక మోస్తరు వర్షం పడితే ఇంకా వారి బతుకులు గతుకుల మాయమే.పట్టణ పరిధిలోని ఎనిమిదో వార్డ్ దగ్గరగా యలమందా గ్రామ పంచాయతీ పరిధిలోని సాయి బాలాజీ నగర్ ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గతం లో కూడా అనేక మంది అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు తప్ప ఎలాంటి అభివృద్ధి, పురోగతి లేదు.ఆ రోడ్డు వైపు నడవాలి అంటే ఎంతో కష్టపడాలి వృద్ధులు అయితే ఏకంగా ఇంట్లో నుండి బయటికి రాని పరిస్థితి .సదరు సమస్య గురించి ఎవరిని కలసిన ఇది తమ పరిధి కాదు అంటే తమ పరిధి కాదు అంటూ దాట వేస్తున్నారు.ప్రస్తుతం ఇక్కడి గృహాల వారు ఎవరికి తమ సమస్యలను చెప్పుకోవలో తెలియక ఎప్పటికి తమ వెతలు తిరుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈప్పటికైనా అధికారులు స్పందించి సదరు ఆ ప్రాంతం లో రోడ్డు వేయించి ప్రజల కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు..