ఆళ్వార్ దాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫౌండర్స్ కప్ 2కె21 ప్రారంభోత్సవం.

ఆళ్వార్ దాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫౌండర్స్ కప్ 2కె21 ప్రారంభోత్సవం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
ఆళ్వార్ దాస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్షన్స్ వారి
ఆద్వర్యంలో ఫౌండర్స్ కప్ 2కె21 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ రాహుల్ ఆళ్వార్ దాస్, కన్వినర్ మధు భట్,కో ఆర్డినేటర్ డా.
మండపాక.కాసు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిధులుగా సెక్రటరీ
డా.ఎస్. వి.హెచ్.రాజేంద్ర, కరెస్పాండెంట్ ఎస్.పి.రవీంద్ర పాల్గొనగా ఈ
కార్యక్రమంలో ఆళ్వార్ దాస్ గ్రూప్ విద్య సంస్థలైన సాంకేతిక విద్య పరిషత్
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్.రాంజీ మాట్లాడుతూ విద్యార్థులకు
ఆరొగ్య పరిరక్షణలో క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేస్తు ,సాంకేతిక
విద్య సంస్థల వ్యవస్దాపకులైన సుంకరి.ఆళ్వార్ దాస్ విద్య రంగంలో
అభివృద్ధి గురించి ఎంతగానో కృషి చేసారని ఆయన కృషిని మనం మరచిపోలేమని
అన్నారు.సాంకేతిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల
ప్రిన్సిపాల్ ఎమ్. వి.ఎన్.శంకరం మాట్లాడుతూ క్రీడలలో జయపజయాలు ముఖ్యం
కాదని, పాల్గొనడమే ముఖ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. శ్రీనివాస
రావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ సుధాకర్ మరియు సాంకేతిక
పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఏ రామకృష్ణ క్రీడాకారులను వారి మాటలతో
ప్రోత్సహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెక్రెటరీ ఎస్ వి హెచ్
రాజేంద్ర అ కరస్పాండెంట్ ఎస్ పి రవీంద్ర జ్యోతి ప్రజ్వలనతో
కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలని అది వారిని
ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని చదువుతోపాటు క్రీడలు కూడా వారి ఎదుగుదలకు
ఉపయోగపడతాయి అని వివరించారు యువతలో క్రీడా స్ఫూర్తి పెంచేందుకు
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ విద్యా సంస్థల వ్యవస్థాపకులైన
సుంకరి ఆళ్వార్ దాస్ 91వ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫౌండర్
కప్ ప్రాముఖ్యతను క్రీడాకారులకు వివరించారు కోఆర్డినేటర్ డాక్టర్ కాసు
మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా చెస్, క్యారమ్స్, త్రో బాల్ క్రికెట్
,టెన్నికోయిట్, వాలీబాల్ పది రోజుల పాటు క్రీడలు నిర్వహించబడతాయి అని
తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఆళ్వార్ దాస్ విద్యా సంస్థల నుండి సుమారు
600 మంది విద్యార్థులు వివిధ క్రీడలకు పేర్లను నమోదు చేసుకున్నారు
అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు ప్లేస్మెంట్ ఆఫీసర్ కృష్ణ కుమార్
వివిధ విభాగాల అధిపతులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ
కార్యక్రమం చివరి రోజైన అక్టోబర్ 30న విజేతలను ప్రకటించి వారికి బహుమతులు
అందజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు.