ఆడపిల్ల అని వదిలేసిన కసాయి తల్లిదండ్రులు ❓️
ఆడపిల్ల అని వదిలేసిన కసాయి తల్లిదండ్రులు ❓️
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
అభం శుభం తెలియని ఓ పసికందును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి రావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం పాలెం పరిధిలోని ప్రకృతి లే అవుట్ లోని ఒక షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు రోజుల పసికందును ఈ నెల 8న వదిలేసి
వెళ్లిపోయారు. పసికందు ఏడుపును గమనించిన స్థానిక పాల వ్యాపారి వెంటనే అక్కడి వార్డు వాలంటీర్కు సమాచారం అందించారు. వాలంటీర్, సచివాలయంలోని మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని పసికందును పరిశీలించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పీఎం పాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పసికందును సీడబ్ల్యూసీ సంరక్షణకు అప్పగించి, కేసు నమోదు చేశారు. రేకుల షెడ్డు లో ఆడ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేయడంతో కేసు నమోదు చేసి శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించినట్టు మధురవాడ ఏసిపి చుక్క శ్రీనివాసరావు తెలిపారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.