ఆంధ్రాలో ప్రజాస్వామ్యం కూని అయ్యింది ❓️పాసర్ల ప్రసాద్

ఆంధ్రాలో ప్రజాస్వామ్యం కూని అయ్యింది ❓️పాసర్ల ప్రసాద్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
రాష్ట్రం లో శాంతిభద్రతలు మచ్చుకైనా కానరావటంలేదని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్రం లో వివిధ చోట్ల తెలుగుదేశం కార్యాలయాలపై, నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసిన సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి గా పరిపాలిస్తున్నారన్నారు. తప్పులు ఎత్తిచూపుతుంటే అంటే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. హింసను ప్రేరేపించేలా కార్యకర్తలను రెచ్చగొట్టి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ తప్పుల నుంచి ప్రజల ద్రుష్టి మరల్చేందుకే తెలుగుదేశం కార్యాలయాలపై, నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు వైసీపీ నాయకుల ఆదేశాలమేరకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం లోని పరిస్థితులపై వెంటనే స్పందించి కేంద్రబలగాలను పంపి శాంతిభదత్రతలు కాపాడాలని పాశర్ల ప్రసాద్ విజ్ఞప్తి చేసారు.