Sports

అలీ ఔట్‌: జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాతో జరగనున్న పింక్‌ బాల్‌ టెస్టుకు 17 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. జానీ బెయిర్‌స్టో, మార్క్‌ వుడ్‌ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే మొయిన్ అలీకి చోటు దక్కలేదు. విరామం కోసం అతడు స్వదేశానికి రానున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంక పర్యటనకు వచ్చిన అతడికి ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. మహమ్మారి నుంచి కోలుకున్న అతడు భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఎనిమిది వికెట్లు తీశాడు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదికగా ఫిబ్రవరి 24 నుంచి భారత్×ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ జట్టు వివరాలు

బర్న్స్‌, సిబ్లీ, క్రాలే, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, బెన్ ఫోక్స్‌, పోప్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్ వోకస్‌, బెస్‌, లీచ్‌, అండర్సన్‌, బ్రాడ్‌, ఆర్చర్‌, స్టోన్‌, మార్క్‌ వుడ్‌

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: