Health

అమ్మోనియా లీకేజీ.. ఇద్దరు మృతి.. 15 మందికి అస్వస్థత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో జరిగిన లీకేజీ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అమ్మోనియా వాయువు లీకేజీ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. విషమంగా ఉన్న ఆ ఉద్యోగులను హాస్పిటల్‌లో చేర్పించారు. అమ్మోనియా లీకేజ్ ఘటనలో మరణించిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ వీపీ సింగ్‌, డిప్యూటీ మేనేజర్ అభయానంద్ కుమార్‌లు ఉన్నారు. ఫుల్‌పూర్‌లోని ఐఎఫ్ఎఫ్‌సీఓ కంపెనీలోని అమ్మోనియా, యురియా యూనిట్లలో పనులు జరుగుతున్న సమయంలో లీకేజీ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి 11.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ పైపు నుంచి లీకేజీ మొదలైనట్లు గుర్తించారు. లీకేజీని వెంటనే ఆపేవారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. లీకేజీ ప్రమాదం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. గత రెండు ఏళ్లలో ఐఎఫ్ఎఫ్‌సీవో ప్లాంట్‌లో అయిదు సార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: