అన్నదానమే మహా భాగ్యం…!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
అన్నదానమే మహా భాగ్యం…!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా శనివారం భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న నేరళ్లవలస కోలనీలో శ్రీ గణేష్ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ దానంలో కల్లా అన్నదానం గొప్పదని ఎంతోమంది మేధావులు, పండితులు చెప్పిన మాటని అన్నారు. పెద్దలు చెప్పిన బాటలో నడుస్తూ నేడు భీమిలి జోన్ 3వ వార్డు నేరళ్లవలస కోలనీలో శ్రీ గణేష్ యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో 1,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమని గంటా నూకరాజు అన్నారు. యువకులు అందరూ కలసి వారికీ తోచిన విరాళాలను సమకూర్చి ఇంత అద్భుతంగా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు అందరూ కలసి చేయడం వలన మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, మంచి భావాలు ఆలవర్చి జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఉపయోగ పడుతుందని గంటా నూకరాజు అన్నారు. వినాయక ఉత్సవాలు నిర్వహించాలా వద్దా అనే మీమాంసలో ఉండి, రెండు రోజులు ముందు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్సవాలకు అనుమతులు మంజూరు చేసిందని అన్నారు. ఇంత తక్కువ సమయంలో మహా అద్భుతంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని గంటా నూకరాజు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక యూత్ బాయ్స నిర్వాహకులు అయిన రేగాని శ్రీనివాసరావు, రేగాని శంకర్ రావు, కోరాడ శ్రీను, పంచదార్ల శ్రీను, కోరాడ అప్పలరాజు, అప్పన్న, ఎర్రాజి, నూకరాజు, గౌరీ శంకర్, సూర్యం, పవన్ కుమార్, సన్యాసిరావు, సాయికుమార్, రామస్వామి తదితరులను గంటా నూకరాజు ప్రత్యేకంగా అభినందించారు.